జూలై 18న ప్రత్యేక లోక్ అదాలత్.. చెక్ బౌన్స్ కేసుల రాజీపై దృష్టి
సిద్దిపేట, జూలై 4 [చైతన్యగళం] తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ, హైదరాబాద్ ఆదేశాల మేరకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ, సిద్దిపేట ఆధ్వర్యంలో జూలై 18న నిర్వహించనున్న ప్రత్యేక లోక్ అదాలత్‌ను పురస్కరించుకుని శనివారం జిల్లా కోర్టు భవనంలో సిద్దిపేట జిల్లా న్యాయవాదులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్ జి. సుదర్శన్ మాట్లాడుతూ, సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం 1,324 చెక్ బౌన్స్ (ఎన్‌ఐ యాక్ట్) కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. జూలై 18న జరిగే...