CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 8:11 pm Posted by : rakeshkashaveni12@gmail.com

జూలై 18న ప్రత్యేక లోక్ అదాలత్.. చెక్ బౌన్స్ కేసుల రాజీపై దృష్టి

సిద్దిపేట, జూలై 4 [చైతన్యగళం]
తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ, హైదరాబాద్ ఆదేశాల మేరకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ, సిద్దిపేట ఆధ్వర్యంలో జూలై 18న నిర్వహించనున్న ప్రత్యేక లోక్ అదాలత్‌ను పురస్కరించుకుని శనివారం జిల్లా కోర్టు భవనంలో సిద్దిపేట జిల్లా న్యాయవాదులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్ జి. సుదర్శన్  మాట్లాడుతూ, సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం 1,324 చెక్ బౌన్స్ (ఎన్‌ఐ యాక్ట్) కేసులు  పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. జూలై 18న జరిగే ప్రత్యేక లోక్ అదాలత్‌లో వీలైనన్ని ఎక్కువ చెక్ బౌన్స్ కేసులను పరస్పర రాజీ ద్వారా పరిష్కరించి, అధిక సంఖ్యలో కేసులు రాజీ అయ్యేలా కృషి చేయాలని న్యాయవాదులకు సూచించారు.

ఈ సమావేశంలో అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి ఎ. కుమారస్వామి , అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి  వి. తరణి , సిద్దిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు  కె. రమేష్ బాబు , సీనియర్, జూనియర్ న్యాయవాదులు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.