అమెరికాలో కాల్పుల కలకలం
కోనీ ఐలాండ్‌లో కాల్పులు – ఎనిమిది మందికి గాయాలు న్యూయార్క్(చైతన్యగళం): అమెరికా స్వాతంత్ర దినోత్సవ వేడుకల మధ్య న్యూయార్క్ నగరంలోని బ్రూక్లిన్‌లోని కోనీ ఐలాండ్ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. కుటుంబ సభ్యులు బార్బిక్యూ విందులో పాల్గొంటున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపగా, ఎనిమిది మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురు చిన్నారులు (6, 7, 12, 14 ఏళ్ల వయసు) ఉన్నారు. 21 ఏళ్ల యువతి పరిస్థితి విషమంగా ఉండగా, మిగతా వారు స్థిరంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. అదనంగా...