బెస్ట్ రన్నర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పాఠశాల అభివృద్ధి

సుల్తానాబాద్ (చైతన్యగళం): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాల అభివృద్ధి కోసం బెస్ట్ రన్నర్ ఆర్గనైజేషన్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. పాఠశాల గోడలు పూర్తిగా రంగులు వెలసిపోవడంతో, రెండు లక్షల పైచిలుకు రూపాయలతో పాఠశాలకు కొత్త రంగులు వేయించి ఆధునికంగా తీర్చిదిద్దింది. ఈ సందర్భంగా బెస్ట్ రన్నర్ ఆర్గనైజేషన్ ఫౌండర్ కోలేటి సతీష్ మాట్లాడుతూ, విద్యార్థులకు కొత్తదనం ఎప్పుడూ ఉత్సాహాన్ని కలిగిస్తుందని, ఆ ఉత్సాహంతో వారు చదువులో రాణించి उज్వల భవిష్యత్తు సాధించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసుకొని...