CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 11:19 am Posted by : CHAITHANYA GALAM NEWS

బెస్ట్ రన్నర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పాఠశాల అభివృద్ధి

సుల్తానాబాద్ (చైతన్యగళం): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాల అభివృద్ధి కోసం బెస్ట్ రన్నర్ ఆర్గనైజేషన్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. పాఠశాల గోడలు పూర్తిగా రంగులు వెలసిపోవడంతో, రెండు లక్షల పైచిలుకు రూపాయలతో పాఠశాలకు కొత్త రంగులు వేయించి ఆధునికంగా తీర్చిదిద్దింది.

ఈ సందర్భంగా బెస్ట్ రన్నర్ ఆర్గనైజేషన్ ఫౌండర్ కోలేటి సతీష్ మాట్లాడుతూ, విద్యార్థులకు కొత్తదనం ఎప్పుడూ ఉత్సాహాన్ని కలిగిస్తుందని, ఆ ఉత్సాహంతో వారు చదువులో రాణించి उज్వల భవిష్యత్తు సాధించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసుకొని మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయడం గర్వించదగ్గ విషయం అని ఆయన అన్నారు.

2011లో ప్రారంభమైన బెస్ట్ రన్నర్ ఇప్పటివరకు వందలాది పాఠశాలలకు సేవలందించడం ఆనందకరమని, రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి విద్యార్థుల ఉన్నత విద్యకు సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని సతీష్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు విశిష్ట అతిథులు పాల్గొని, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.