కరీంనగర్, జూలై 04 (చైతన్య గళం):
విద్యార్థుల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన, క్రమశిక్షణను పెంపొందించే లక్ష్యంతో శనివారం మెహర్ నగర్ పాత డి-మార్ట్ సమీపంలో లోని వింధ్యావాలీ హైస్కూల్ లో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం ట్రాఫిక్ పోలీసులు నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు విద్యార్థులకు రోడ్డు నిబంధనలు, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించడం యొక్క ప్రాముఖ్యత, మరియు మైనర్ డ్రైవింగ్ మైనర్లు వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాల గురించి వివరించారు. విద్యార్థులు తామే కాకుండా తమ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులుకూడాట్రాఫిక్నిబంధనలుపాటించేలా అవగాహన కల్పించాలని కోరారుకార్యక్రమ ముఖ్యాంశాలుమైనర్ డ్రైవింగ్ నివారణవయస్సు నిండకుండా, డ్రైవింగలైసెన్స్లేకుండావాహనాలునడపకూడదని విద్యార్థులకు స్పష్టం చేశారు.ట్రాఫిక్ సిగ్నల్స్ పై అవగాహన రోడ్డు గుర్తులు, ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు జీబ్రా క్రాసింగ్ ఉపయోగించడంపై అవగాహన కల్పించారు.స్వయం క్రమశిక్షణ రోడ్డు భద్రత అనేది ఒకరి కోసం కాదు, మన ప్రాణాల రక్షణ కోసమని వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, ట్రాఫిక్ ఎస్సై ప్రసాద్ మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు పాఠశాల సిబ్బంది ట్రాఫిక్ పోలీసులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.