ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వ్యసనం.. మహిళ కిడ్నాప్, దోపిడీ, హత్యాయత్నం

సాంకేతిక ఆధారాలతో నిందితుడి అరెస్ట్.. కరీంనగర్ పోలీసుల చాకచక్యం కరీంనగర్, జూలై 4 (చైతన్యగళం): ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌లో భారీగా డబ్బులు నష్టపోయి, అప్పుల ఒత్తిడితో మహిళను కిడ్నాప్ చేసి, బంగారు ఆభరణాలు దోచుకుని హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.తేదీ. 01-07-2026 నాడు ఉదయం 1000 గంటలకు కరీంనగర్ టవర్ సర్కిల్ సమీపంలోని లేబర్ అడ్డా వద్ద కూలీ పనికి వేచి ఉన్న గంగాధర లక్ష్మి (55) అనే మహిళ అదృశ్యమైన ఘటనపై తొలుత కరీంనగర్-3 టౌన్...