అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి వివేకానంద
మంచిర్యాల, జూలై 5 (చైతన్యగళం): రాష్ట్రంలోని ప్రతి రంగాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద తెలిపారు. ఆదివారం భీమారం మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అధికారులతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ వంటి పథకాలు అందిస్తున్నామని చెప్పారు.చెన్నూరు నియోజకవర్గంలో పంచాయతీరాజ్...