మహబూబాబాద్‌లో ఘనంగా కొణిజేటి రోశయ్య 93వ జయంతి వేడుకలు
మహబూబాబాద్ (చైతన్యగళం): మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్, ప్రజానాయకుడు కొణిజేటి రోశయ్య 93వ జయంతి వేడుకలు శనివారం మహబూబాబాద్ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు బుక్య ఉమా, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్, మహబూబాబాద్ ఆర్యవైశ్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. నాయకులు రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా విశిష్ట సేవలు అందించారని, ఏడు సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను...