CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 11:13 am Posted by : CHAITHANYA GALAM NEWS

మహబూబాబాద్‌లో ఘనంగా కొణిజేటి రోశయ్య 93వ జయంతి వేడుకలు

మహబూబాబాద్ (చైతన్యగళం):
మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్, ప్రజానాయకుడు కొణిజేటి రోశయ్య 93వ జయంతి వేడుకలు శనివారం మహబూబాబాద్ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు బుక్య ఉమా, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్, మహబూబాబాద్ ఆర్యవైశ్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.

నాయకులు రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా విశిష్ట సేవలు అందించారని, ఏడు సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టి అరుదైన రికార్డు సృష్టించారని కొనియాడారు. అనంతరం రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలందించి ప్రజల మన్ననలు పొందిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. ఆయన సేవలను స్మరించుకుంటూ జయంతి వేడుకలు నిర్వహించడం గర్వకారణమని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతి రమేష్, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి నాళ్ల లక్ష్మీనరసింహారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వేమిశెట్టి కిషోర్ కుమార్, మహబూబాబాద్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు భువనగిరి గిరిధర్ గుప్తా, ఇమ్మడి కృష్ణమూర్తి, జంగాల సదాశివుడు, నాళ్ల వేణుగోపాల్, ఇమ్మడి రవికుమార్, బోనగిరి ప్రసాద్, రవికుమార్, సతీష్, చిదురాల జ్ఞానేశ్వర్, స్థానిక వార్డు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు.