పోక్సో చట్టంపై అవగాహన ప్రతి విద్యార్థికి అవసరం: అదనపు జ్యూడిషల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అర్వపల్లి కృష్ణతేజ్
మహబూబాబాద్(చైతన్యగళం): పోక్సో (POCSO) చట్టంలోని నిబంధనలు, పిల్లల హక్కులపై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని అదనపు జ్యూడిషల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అర్వపల్లి కృష్ణతేజ్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఆదేశాల మేరకు శనివారం మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో ఉన్న ప్రభుత్వ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల పోక్సో కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ బాలబాలికల్లో ఆ చట్టంపై సరైన అవగాహన లేకపోవడం ఆందోళనకరమన్నారు. విద్యార్థినులు...