ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్పాట్ కౌన్సిలింగ్ కు ఆహ్వానం

మంచిర్యాల(చైతన్యగళం): 2026–27 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం గ్రూపులలో ఖాళీల భర్తీకి స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు సమన్వయకర్త రామ కళ్యాణి తెలిపారు. జిల్లాలోని బాలురకు జైపూర్, బాలికలకు లక్షెట్టిపేటలోని గురుకుల జూనియర్ కళాశాలలో జూలై 6న ఉదయం 9 గంటలకు కౌన్సిలింగ్ జరుగనుంది. అర్హత కలిగిన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, నకలు ప్రతులతో హాజరుకావాలని సూచించారు.ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు రిజిస్ట్రేషన్, మధ్యాహ్నం...