మీర్జాపూర్‌లో ఉచిత పుస్తకాలు, స్కూల్ బ్యాగుల పంపిణీ
హుస్నాబాద్(చైతన్య గళం): సమాజ సేవే ధ్యేయంగా పనిచేస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ టైకూన్ ప్రొఫెషనల్స్ (320H), సురేవిత ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా విద్యా సామగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులకు నోట్‌బుక్స్, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన స్కూల్ బ్యాగులు అందజేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చదువును కొనసాగించి ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం...