బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు రోడ్డు ప్రమాదం
భువనగిరి, జూలై 5(చైతన్యగళం): తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఈ రోజు మధ్యాహ్నం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వరంగల్ పర్యటనకు వెళ్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కారు భువనగిరి సమీపంలో మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎమ్మెల్సీకి గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ఆయనను సమీప ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు...