బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగా: శంతన్ రామరాజు

మహబూబాబాద్(చైతన్యగళం): బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగా అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతన్ రామరాజు పేర్కొన్నారు. వంగవీటి మోహనరంగా 79వ జయంతి సందర్భంగా శనివారం శ్రీరాం నగర్ బీసీ కాలనీలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని రంగ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శంతన్ రామరాజు మాట్లాడుతూ, వంగవీటి మోహనరంగా పేదలు, కార్మికులు, అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన ప్రజానాయకుడని కొనియాడారు. ప్రజల సమస్యలను ధైర్యంగా ప్రశ్నించిన నాయకుడిగా ఆయన చరిత్రలో...