ఘనంగా కొణిజేటి రోశయ్య 93వ జయంతి వేడుకలు
మహబూబాబాద్ (చైతన్యగళం): మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య 93వ జయంతి వేడుకలు శనివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ప్రజాసేవలు, రాజకీయ జీవితంలో చూపిన నిబద్ధతను స్మరించుకున్నారు. ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి నాళ్ల లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ, రోశయ్య నిజాయితీ, నిరాడంబరత, విలువలతో కూడిన రాజకీయాలకు చిరునామాగా నిలిచారని అన్నారు. ఆర్థిక పరిపాలనలో ఆయనకు ఉన్న విశేష అనుభవం,...