CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 11:11 am Posted by : CHAITHANYA GALAM NEWS

ఘనంగా కొణిజేటి రోశయ్య 93వ జయంతి వేడుకలు

మహబూబాబాద్ (చైతన్యగళం):
మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య 93వ జయంతి వేడుకలు శనివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ప్రజాసేవలు, రాజకీయ జీవితంలో చూపిన నిబద్ధతను స్మరించుకున్నారు.

ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి నాళ్ల లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ, రోశయ్య నిజాయితీ, నిరాడంబరత, విలువలతో కూడిన రాజకీయాలకు చిరునామాగా నిలిచారని అన్నారు. ఆర్థిక పరిపాలనలో ఆయనకు ఉన్న విశేష అనుభవం, ప్రజా సంక్షేమంపై ఉన్న అంకితభావం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. సమాజ సేవతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు వేమిశెట్టి కిషోర్ కుమార్, చిదిరాల జ్ఞానేశ్వర్, గిరిధర్ గుప్తా, రవీంద్ర గుప్తా, నాళ్ల వీరన్న, ఇమ్మడి రవి, నాళ్ల వేణు, కొండ్ల సూరయ్య, తమ్మి ఉపేందర్, వేమిశెట్టి సతీష్, బోనగిరి ప్రసాద్ తదితరులు పాల్గొని రోశయ్యకు ఘనంగా నివాళులర్పించారు.