ఘనంగా అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు
మహబూబాబాద్(చైతన్యగళం): మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతిని నేతాజీ సేవాసమితి ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణంలోని అక్షర కాన్సెప్ట్ స్కూల్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ సేవాసమితి వ్యవస్థాపకుడు డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ, బ్రిటిష్ పాలనకు ధీటుగా ఎదిరించి గిరిజనుల హక్కులు, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. దేశభక్తి, ధైర్యసాహసాలు, క్రమశిక్షణ వంటి విలువలను యువత అలవరచుకుని అల్లూరి ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబం నుంచి...