విద్యార్థినుల్లో నాయకత్వ వికాసానికి ‘వాయిస్–4 గర్ల్స్’

ప్రభుత్వ ఎస్టీ గురుకులంలో 10 రోజుల శిక్షణ విజయవంతం ఆమనగల్లు, జూలై 4 (చైతన్యగళం): విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత పెంపొందించాలనే లక్ష్యంతో గిరిజన సంక్షేమ శాఖ, హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఎస్టీ బాలికల గురుకుల పాఠశాల (Govt STGH), ఆమనగల్లులో నిర్వహించిన ‘వాయిస్–4 గర్ల్స్’ శిక్షణ కార్యక్రమం శనివారం విజయవంతంగా ముగిసింది. జూన్ 24 నుంచి జూలై 4 వరకు పది రోజులపాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో *‘సఖి పీర్ గ్రూప్ లీడర్స్’*గా ఎంపికైన విద్యార్థినులకు వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ...