దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో విద్యార్థుల్లో పోటీ స్ఫూర్తి పెంపొందాలి – సీఐ వెంకటేశ్వర్లు
ఆమనగల్లు, జూలై 4 (చైతన్యగళం): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా శనివారం ఆమనగల్లు పట్టణంలోని మానస గార్డెన్‌లో అంబేద్కర్ యువజన సంఘం, బుద్ధా చెస్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు చెస్ పోటీలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు లండం చిన్న జంగయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆమనగల్లు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ కోటేశ్వర్, ప్రముఖ సంఘసేవకుడు, 5వ వార్డు కౌన్సిలర్ పాపిశెట్టి రాము ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు....