హైద్రాబాద్, జూలై 4 (చైతన్యగళం) : క్రమశిక్షణకు మారు పేరు.. అజాత శత్రువుగా తెలుగు ప్రజల మనసుల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్న నేత మాజీ సీఎం కొణిజేటి రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య 93వ జయంతిని పురస్కరించుకుని ఆయన రాష్ట్రానికి చేసిన సేవలను తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరావాది లక్ష్మి నారాయణ గుర్తు చేశారు. ఖైరతాబాద్ చింతబస్తి లో తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ కార్యాలయంలో రాష్ట్ర మహాసభ ఆధ్వర్యంలో కి. శే. కొనిజెటి రోషయ్య 93 వ జయంతి సందర్బంగా ఆయన విగ్రహానికి రాష్ట్ర అధ్యక్షులు అమరావాది లక్ష్మి నారాయణ గుప్త , గణేష్ గుత్తా చింతల రవికుమార్ గుప్త తదితరుల తో కలిసి రోశయ్య విగ్రహానికి పూల మాల సమర్పించి ఘనంగా నివాళులర్పించారు . ఈ సందర్భంగా అమరావాది లక్ష్మి నారాయణ గుప్త మాట్లాడుతూ.. రోశయ్య దేశ రాజకీయ వేత్తఅని అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం వేమూరులో 1933లో జన్మించిన ఆయన.. విద్యార్థి నాయకుడిగా ఎదిగారని తెలిపారు. 2009-2010 మధ్యకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన రోశయ్య.. 2011-2016 వరకు తమిళనాడు గవర్నర్‌గా, కర్ణాటక రాష్ట్రానికి (అదనపు గవర్నర్)గా బాధ్యతలు నిర్వర్తించారని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉంటూ, 16 సార్లు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ పెద్దలు జిల్లా నాయకులు తదితరులు ఉన్నారు.