రేవంత్ కృతజ్ఞత సభకు పోటెత్తిన ఆమనగల్లు కాంగ్రెస్ శ్రేణులు

ఆమనగల్లు, జూలై 4 (చైతన్యగళం): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహా విజయోత్సవ కృతజ్ఞత బహిరంగ సభకు ఆమనగల్లు మున్సిపాలిటీ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శనివారం భారీ సంఖ్యలో తరలివెళ్లారు. సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో ఉదయం నుంచే పట్టణంలోని అన్ని వార్డుల నుంచి కార్యకర్తలు కాంగ్రెస్ జెండాలు చేతబట్టి, సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా నినాదాలు చేస్తూ వాహనాల ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వస్పుల మానయ్య జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆయన...