విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనమే లక్ష్యం– సర్పంచ్ న్యాలపట్ల నరేందర్ రెడ్డి
ఆమనగల్లు, జూలై 4 (చైతన్యగళం): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పరిశుభ్రమైన, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలనే లక్ష్యంతో ఆకుతోటపల్లి గ్రామ సర్పంచ్ న్యాలపట్ల నరేందర్ రెడ్డి శనివారం జెడ్పీహెచ్‌ఎస్ ఆకుతోటపల్లి పాఠశాలకు అవసరమైన కొత్త వంట పాత్రలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. మధ్యాహ్న భోజనం తయారీలో వినియోగించే పాత్రలు శుభ్రంగా, నాణ్యంగా ఉంటేనే విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని పేర్కొన్నారు. అందుకే పాఠశాలకు అవసరమైన అన్ని వంట పాత్రలను...