CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 5:20 pm Posted by : CHAITHANYA GALAM NEWS

జోరందుకున్న ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ

అంబర్పేట, జూలై 4 (చైతన్యగళం):
ఓటరు జాబితా సవరణ కార్యక్రమం సర్‌లో భాగంగా అంబర్పేట డివిజన్ ప్రేమ్‌నగర్‌లో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ జోరందుకుంది. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె రూబీ స్టీవెన్‌సన్ స్థానికులకు ఎన్యుమరేషన్ ఫారాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటరు జాబితాలో పేర్లు ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్యుమరేషన్ ఫారాలను తప్పులు లేకుండా నింపి బూత్ లెవల్ అధికారులకు అందజేయాలని సూచించారు. లేనిపక్షంలో వారి ఓట్లు జాబితా నుంచి తొలగించబడే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుని తమ ఓట్లను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జి. వరలక్ష్మి, తిరుపతి గుప్తా, బిఎల్వో షేక్ ఇక్బాల్, మహ్మద్ వాజిద్, సాజిద్ ఖాన్, బిఎల్వో రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.