మిడ్జిల్‌కు సీఎం కృతజ్ఞత వందనం
రాజకీయ జన్మనిచ్చిన నేలపై రేవంత్‌రెడ్డి థ్యాంక్స్ గివింగ్ సభ 20 ఏళ్ల ప్రజాప్రస్థానానికి మైలురాయి.. అనుచరులు, ఆనాటి పెద్దలతో ఆత్మీయ కలయిక హైదరాబాద్, జూలై 4(చైతన్యగళం): తనకు రాజకీయంగా తొలి గుర్తింపు తీసుకొచ్చిన మిడ్జిల్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి A. Revanth Reddy ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రజాప్రతినిధిగా తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానానికి గుర్తుగా, తన తొలి విజయానికి పునాది వేసిన నేలపై ‘థ్యాంక్స్ గివింగ్’ సభను నిర్వహిస్తూ ప్రజల ఆశీర్వాదాలకు నమస్కరించేందుకు సిద్ధమయ్యారు. 2006లో జరిగిన పరిషత్...