నిరుపేదలకు మున్నూరు కాపు సంఘం అండగా
పెద్దపల్లి, జూలై 3 (చైతన్యగళం): జిల్లాలోని నిరుపేద మున్నూరు కాపు కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామని పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు జడల సురేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్. రాజయ్య స్పష్టం చేశారు. గత జూన్ నెలలో కురిసిన అకాల వర్షాల వల్ల అందుగులపల్లి గ్రామానికి చెందిన కామ వెంకన్న, సుగుణల ఇల్లు కూలిపోయి నిరాశ్రయులైన ఘటనపై సంఘం తక్షణమే స్పందించింది. సభ్యుల సహకారంతో సుమారు 35 వేల రూపాయల విలువైన రేకులు, నగదు సేకరించి బాధితులకు అందజేశారు. ఈ నిధులతో ఇల్లు సరిచేసుకోవడానికి అవసరమైన...