పోలీసులకు సవాల్ విసురుతున్న చోరులు

హుస్నాబాద్  జూలై 3 {చైతన్యగళం}: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మరోసారి అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. వారం రోజుల క్రితం ప్రధాన రహదారిపై ఉన్న దుకాణాల్లో చోరీలకు పాల్పడిన ఘటన మరవకముందే, ఈసారి పోలీస్ స్టేషన్‌కు అత్యంత సమీపంలో ఉన్న ఆలయాలనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడటం స్థానికుల్లో ఆందోళనకు గురిచేస్తోంది. అర్ధరాత్రి సమయంలో స్థానిక మార్కండేయ దేవాలయంలోకి చొరబడిన దుండగులు అక్కడ ఉన్న రెండు హుండీలను పగులగొట్టి, భక్తులు సమర్పించిన నగదును అపహరించారు. అనంతరం సమీపంలోని అభయ వీరాంజనేయ స్వామి దేవాలయంలోకి...