CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 6:16 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఓటరు జాబితాలో ప్రతి అర్హుడి పేరు ఉండాలి – ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

గోదావరిఖని, జూలై 3 (చైతన్యగళం): రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ఆధ్వర్యంలో సర్ బి ఎల్ ఎ ఇంచార్జులతో సమీక్షా సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం అత్యంత కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. ప్రతి బూత్ పరిధిలో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించి, దరఖాస్తులు నింపడంలో సహకరించాలని అన్నారు. దుద్దిళ్ల శ్రీను బాబు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి పోలింగ్ బూత్‌లో సర్ ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సందేహాలను నివృత్తి చేస్తూ, ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ప్రతి దరఖాస్తు సక్రమంగా పూర్తి అయ్యేలా చూడాలని సూచించారు.ఈ సమావేశంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, నియోజకవర్గంలోని సర్ బి ఎల్ ఎ ఇంచార్జులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.