ప్రజా సమస్యల పరిష్కారమే మా ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ, జూలై 3(చైతన్యగళం): మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “ప్రగతి సింగిడి.. జనంతో మాట.. పల్లె బాట” కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చిల్లాపురం గ్రామంలో రెండ్రోజుల పాటు విస్తృత పర్యటన చేపట్టి ప్రజలతో మమేకమయ్యారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, విద్యుత్, వ్యవసాయం, గృహనిర్మాణం, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ప్రజలు నేరుగా వినిపించిన ప్రతి సమస్యను శ్రద్ధగా ఆలకించి సంబంధిత అధికారుల సమక్షంలోనే నమోదు చేయించి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు....