ఈవీఎం గోదాం తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ రెవెన్యూ డి. శ్రీనివాస్ రెడ్డి

కరీంనగర్ , జూలై 3 (చైతన్య గళం): కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను శుక్రవారం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. శ్రీనివాస్ రెడ్డి రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వివిప్యాట్ గోదాంలను తనిఖీ చేస్తూ సమగ్ర నివేదికలను పంపిస్తున్నట్లు తెలిపారు. ఈవీఎంల భద్రత కోసం తీసుకున్న ఏర్పాట్లపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోదాం వద్ద సిబ్బంది హాజరు తీరును కూడా పరిశీలించారు....