CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 11:04 pm Posted by : rakeshkashaveni12@gmail.com

ఈవీఎం గోదాం తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ రెవెన్యూ డి. శ్రీనివాస్ రెడ్డి

కరీంనగర్ , జూలై 3 (చైతన్య గళం):

కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను శుక్రవారం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. శ్రీనివాస్ రెడ్డి రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వివిప్యాట్ గోదాంలను తనిఖీ చేస్తూ సమగ్ర నివేదికలను పంపిస్తున్నట్లు తెలిపారు. ఈవీఎంల భద్రత కోసం తీసుకున్న ఏర్పాట్లపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోదాం వద్ద సిబ్బంది హాజరు తీరును కూడా పరిశీలించారు.

ఈవీఎం, వివిప్యాట్ గదుల భద్రత విషయంలో పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో అర్బన్ తహసిల్దార్ రాజేష్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మడుపు మోహన్, బీజేపీ పార్టీ ప్రతినిధి నాంపల్లి శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి సత్తినేని శ్రీనివాస్, ఎంఐఎం పార్టీ ప్రతినిధులు మజీద్ హుమైన్, సయ్యద్ ఇబ్రహీం, టీడీపీ పార్టీ ప్రతినిధి ఎర్రవెల్లి రవీందర్, సీపీఎం పార్టీ ప్రతినిధి నరేష్, బీఎస్పీ పార్టీ ప్రతినిధి సిరిసిల్ల అంజయ్య, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.