చెక్కు బౌన్స్ కేసుల ప్రత్యేక లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ఇన్‌చార్జ్ ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్. సునీత
మహబూబాబాద్, జూలై 3(చైతన్యగళం): జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ఈ నెల 18న నిర్వహించనున్న చెక్కు బౌన్స్ కేసుల ప్రత్యేక లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మహబూబాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్. సునీత పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కోర్టులో న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. బ్యాంకులు, చిట్‌ఫండ్ సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థలు తాము దాఖలు చేసిన చెక్కు బౌన్స్ కేసుల్లో రాజీకి ముందుకు రావాలని సూచించారు....