ఓటరు జాబితా సవరణ పనులను పరిశీలించిన సర్పంచ్ కప్పల ప్రవీణ్
ఎలిగేడు, జూలై 3 (చైతన్యగళం): ఎలిగేడు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో శుక్రవారం జరిగిన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎన్యూమరేషన్ ఫారాలు) పనులను గ్రామ సర్పంచ్ కప్పల ప్రవీణ్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన బీఎల్‌వోలతో మాట్లాడి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఓటరు జాబితాలో ప్రతి ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి పొరపాట్లు లేకుండా సరిచేయాలని సూచించారు. బీఎల్‌వోలు ప్రతి ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించి, ఎన్యూమరేషన్ ఫారాల్లో ఖచ్చితంగా నమోదు చేయాలని ఆయన ఆదేశించారు.ఓటర్ల వివరాల సవరణలో నిర్లక్ష్యం...