కల్వకుర్తిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని సదానందం గౌడ్ విజ్ఞప్తి

కల్వకుర్తి, జూలై 3 (చైతన్యగళం): ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గాన్ని 15 మండలాలతో కూడిన జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమనేత, కల్వకుర్తి జేఏసీ చైర్మన్ డాక్టర్ అయిల్ సదానందం గౌడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.సదానందం గౌడ్ మాట్లాడుతూ, “కల్వకుర్తి ప్రాంతం చరిత్ర, సాంస్కృతిక వైభవం, ఉద్యమాల పునాది. స్వాతంత్ర్య పోరాటాలు, రైతాంగ ఉద్యమాలు, తెలంగాణ విద్యార్థి ఉద్యమం, కరువు వ్యతిరేక పోరాటాలు, కేఎల్ఐ నీళ్ల పోరాటం వంటి అనేక ఉద్యమాలకు కేంద్రంగా నిలిచింది. విద్య, వైద్యం,...