ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై కక్షపూరితంగానే భద్రత తొలగించారని ఆరోపణ
కల్వకుర్తి, జూలై 3 (చైతన్యగళం): బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ భద్రతను కక్షపూరితంగానే తొలగించారని బీఆర్‌ఎస్ పార్టీ యూత్ వింగ్ అధ్యక్షుడు వట్టేపు కిషోర్ ఆరోపించారు.శుక్రవారం బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “ప్రవీణ్‌కుమార్ ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలపై గళమెత్తి, ప్రభుత్వ అవినీతిని ఎండగడుతున్నారు. అందుకే రాజకీయ కక్షతో ఆయనకు ఇచ్చిన బుల్లెట్‌ప్రూఫ్ కార్, భద్రతా సిబ్బందిని తొలగించారు” అని అన్నారు.అదేవిధంగా, “ప్రవీణ్‌కుమార్ సతీమణి లక్ష్మీబాయి 20 ఏళ్లుగా...