కల్వకుర్తి, జూలై 3 (చైతన్యగళం): బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ భద్రతను కక్షపూరితంగానే తొలగించారని బీఆర్‌ఎస్ పార్టీ యూత్ వింగ్ అధ్యక్షుడు వట్టేపు కిషోర్ ఆరోపించారు.శుక్రవారం బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “ప్రవీణ్‌కుమార్ ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలపై గళమెత్తి, ప్రభుత్వ అవినీతిని ఎండగడుతున్నారు. అందుకే రాజకీయ కక్షతో ఆయనకు ఇచ్చిన బుల్లెట్‌ప్రూఫ్ కార్, భద్రతా సిబ్బందిని తొలగించారు” అని అన్నారు.అదేవిధంగా, “ప్రవీణ్‌కుమార్ సతీమణి లక్ష్మీబాయి 20 ఏళ్లుగా వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నారు. రిటైర్మెంట్‌కు ఏడాది మాత్రమే మిగిలి ఉండగా కావాలని వేరే శాఖకు బదిలీ చేయడం జరిగింది. ఇది కుటుంబంపై కక్ష సాధింపు చర్య” అని విమర్శించారు.“ఒక దళిత విద్యావేత్తగా లక్షలాది విద్యార్థులకు గురుకులాల ద్వారా వెలుగులు నింపిన ప్రవీణ్‌కుమార్ పై ఇలా చేయడం సబబు కాదు. రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకపోతే కుటుంబంపై కక్ష సాధించడం తగదు. ఇలాంటి చర్యలు కొనసాగితే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది” అని హెచ్చరించారు.ఈ సమావేశంలో మండల బీఆర్‌ఎస్ నాయకులు ముత్యాల రమేష్, వార్డు సభ్యులు నరేష్, ఎస్‌సి సెల్ మండల కార్యదర్శి రామకృష్ణ, ఉపాధ్యక్షులు జోగు విష్ణు, యువ నాయకులు వట్టేపు గణేష్, విష్ణు, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.