CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 9:08 pm Posted by : CHAITHANYA GALAM NEWS

100వ రోజు కొనసాగిన 98 జీవో బాధితుల రిలే దీక్ష

నందికొట్కూరు, జూలై 3 (చైతన్యగళం): శ్రీశైలం ముంపు బాధితులు నందికొట్కూరు పట్టణంలో 100 రోజులుగా రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నప్పటికీ నేతలు పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు శుక్రవారం రిలే ర్యాలీ నిర్వహించి, “ఇలా నిర్లక్ష్యం చేస్తే మాకు ఆత్మహత్యలే శరణ్యం అవుతాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ర్యాలీకి వైఎస్సార్సీపీ ఇన్‌చార్జి డాక్టర్ దారా సుధీర్ సుంకులమ్మ గుడి వద్ద నుండి పటేల్ సెంటర్ వరకు పాల్గొని బాధితులకు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకుడు దారా సుధీర్, రాయలసీమ నీటి సంఘం అధ్యక్షుడు దశరధి రామిరెడ్డి మాట్లాడుతూ, “జీవో 98 ప్రకారం మిగిలిన 674 మందికి ఉద్యోగాలు కల్పించాలి. లేనిపక్షంలో వైఎస్సార్సీపీ ఆమరణ నిరాహార దీక్ష చేపడుతుంది” అని హెచ్చరించారు.సీపీఎం, సీపీఐ, బీఎస్పీ పార్టీలు ఈ ఆందోళనకు మద్దతు ప్రకటించాయి.