భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే రీ సర్వే
మహబూబాబాద్, జూలై 3(చైతన్యగళం): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ భారతి–భూముల రీ సర్వే కార్యక్రమం ద్వారా ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా భూకొలతల సర్వే ల్యాండ్ సహాయ సంచాలకులు సి.హెచ్. శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం జిల్లాలోని పలు మండలాల్లో ప్రజాప్రతినిధులతో కలిసి అధికారులు భూముల రీ సర్వేపై గ్రామసభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. జిల్లాలో 70 గ్రామాల్లో రీ సర్వే నిర్వహించేందుకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు...