గర్రెపల్లిలో ప్రైవేట్ స్కూల్ బస్సులకు బ్రేక్ ప్రభుత్వ బడికే గ్రామం మద్దతు

సైదాపూర్ , జూలై 3(చైతన్యగళం): కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గర్రెపల్లి గ్రామపంచాయతీ ప్రభుత్వ విద్య బలోపేతానికి కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామంలోని ప్రతి చిన్నారి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే చదవాలనే లక్ష్యంతో గ్రామంలోకి ప్రైవేట్ పాఠశాలల బస్సుల ప్రవేశాన్ని నిషేధిస్తూ గ్రామపంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. గ్రామపంచాయతీ అనుమతి లేకుండా ప్రైవేట్ పాఠశాలల బస్సులు గ్రామంలోకి ప్రవేశిస్తే సంబంధిత యాజమాన్యానికి రూ.10 వేల జరిమానా విధించడంతో పాటు అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని పాలకవర్గం స్పష్టం చేసింది. ఇటీవల గ్రామస్థుల...