CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 9:15 pm Posted by : CHAITHANYA GALAM NEWS

విద్యార్థుల ఆరోగ్య పరీక్షలను లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయాలి – డీఎంహెచ్‌వో డాక్టర్ బి. రవి రాథోడ్

మహబూబాబాద్, జూలై 3(చైతన్యగళం): విద్యార్థులకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించేందుకు రాష్ట్రీయ బాల స్వస్థ ఆరోగ్య కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసి, నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ వైద్య సిబ్బందికి సూచించారు.

శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన రాష్ట్రీయ బాల స్వస్థ ఆరోగ్య కార్యక్రమంపై వైద్యాధికారులు, ఫార్మసిస్టులు, ఏఎన్‌ఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రభుత్వ, రెసిడెన్షియల్ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని అన్నారు. ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి అవసరమైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని, కార్యక్రమ లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ శివకుమార్, డాక్టర్ సాయి లక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్‌వో రాజ్‌కుమార్‌తో పాటు సంబంధిత వైద్య సిబ్బంది పాల్గొన్నారు.