సర్కారు బడిపై నమ్మకం చాటిన మాజీ సర్పంచ్

ఆమనగల్లు, జూలై 3 (చైతన్యగళం): ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందనే విశ్వాసంతో మాజీ సర్పంచ్ రామచందర్ తన ముగ్గురు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ప్రవేశోత్సవ కార్యక్రమంలో ఆయన తన పిల్లలను స్వయంగా పాఠశాలలో చేర్పించారు. ఈ సందర్భంగా రామచందర్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా ప్రమాణాలు, ఆధునిక బోధనా విధానాలు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, మెరుగైన మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం,...