వైరల్ హెపటైటిస్ నిర్మూలన పై జిల్లా స్థాయి సమీక్ష

రంగారెడ్డి, జూలై 3 ( చైతన్యగళం): ప్రపంచ హెపటైటిస్ నిర్మూలన లక్ష్యంగా వైరల్ హెపటైటిస్ నివారణ, గుర్తింపు మరియు చికిత్స కార్యక్రమాల అమలుపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం శుక్రవారం ఐడీఓసీ, కొంగర కలాన్ కలెక్టరేట్‌లో జరిగింది. ఈ సమావేశానికి గౌరవ అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి, ఐఏఎస్ అధ్యక్షత వహించారు. సమావేశంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డాక్టర్ డి. స్వర్ణ కుమారి, అదనపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డాక్టర్ వై. పాపారావు, జాతీయ వైరల్ హెపటైటిస్ నియంత్రణ...