CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 6:20 pm Posted by : CHAITHANYA GALAM NEWS

అర్హులైన రైతులకు ఉచిత పత్తి విత్తనాల పంపిణీ

మర్రిగూడ, జూలై 3 (చైతన్యగళం):
మర్రిగూడ మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం కాటన్ కపాస్ కాంతి పథకంలో భాగంగా అర్హులైన రైతులకు ఉచిత పత్తి విత్తనాలను పంపిణీ చేశారు.

మండల వ్యవసాయ అధికారి సహాస్ మాట్లాడుతూ, “రైతు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఉచిత పత్తి విత్తనాలు అందజేస్తున్నాం. పంటల పర్యవేక్షణకు జియో ట్యాగ్ ద్వారా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారు” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచులు, ఏవోలు, రాధిక, విజయ్ కుమార్, అలాగే పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.