చెరువు కాలువపై అక్రమ నిర్మాణం కూల్చివేత
ఆమనగల్లు, జూలై 3 (చైతన్యగళం): ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో హాస్పిటల్ వెనుక ఉన్న కాలనీలో చెరువు కాలువపై నిర్మించిన అక్రమ ప్రహరీ గోడను శుక్రవారం మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు కూల్చివేశారు. చెరువు కాలువను ఆక్రమించి నిర్మాణం చేపట్టినట్లు గుర్తించిన అధికారులు మున్సిపల్ నిబంధనల మేరకు ఈ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో ఎవరూ రోడ్లు, కాలువలు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టవద్దని సూచించారు. గృహ నిర్మాణాలు చేపట్టే...