ఎస్‌ఐఆర్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచనలు
వంగూరు, జూలై 3 (చైతన్యగళం): వంగూరు మండలంలోని వెలమలపల్లి గ్రామంలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలోని పోలింగ్ కేంద్రం నం.20 పరిధిలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, నింపిన దరఖాస్తుల స్వీకరణ, వివరాల ధ్రువీకరణ, డిజిటలైజేషన్ విధానాన్ని కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామంలో 348 మంది ఓటర్లకు 100% ఫారాలు పంపిణీ చేసినట్లు, ఐదుగురి వివరాలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. వంగూరు మండలంలో ఉన్న...