బోడుప్పల్, జూలై 3 (చైతన్యగళం): మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా 12వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బొమ్మక్ కళ్యాణ్ నియమితులయ్యారు.ఈ సందర్భంగా బొమ్మక్ కళ్యాణ్ మాట్లాడుతూ, “2014లో మా తండ్రి బొమ్మక్ గోపీనాథ్ ఉప సర్పంచ్‌గా బోడుప్పల్ ప్రజలకు ఎనలేని సేవలు అందించారు. ఆయనపై ఉన్న ప్రేమాభిమానంతోనే ప్రజలు నన్ను కార్పొరేటర్‌గా గెలిపించారు. నా డివిజన్ ప్రజలకు సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు పూర్తిస్థాయిలో సమకూర్చాను. నాపై నమ్మకంతో బోడుప్పల్ డివిజన్ అధ్యక్షునిగా నియమించిన డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ కి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శ్రీధర్ బాబుకి ప్రత్యేక ధన్యవాదాలు” అని తెలిపారు.