దేవరకొండ,జూలై 03(చైతన్యగళం): దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత, ప్రజల అభిమాన నాయకులు, ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని, కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఘనంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సతీమణి నేనావత్ జ్యోతి ప్రసన్న బాలు నాయక్ , యువజన నాయకులు నేనావత్ దేవరన్ నాయక్ హాజరై రక్తదాతలను అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ, రక్తదానం మహాదానమని, ఒక వ్యక్తి చేసిన రక్తదానం అనేకమంది ప్రాణాలను కాపాడే గొప్ప మానవతా సేవ అని పేర్కొన్నారు. యువత సేవా భావంతో ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో పెద్దఎత్తున పాల్గొని సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ జన్మదినాన్ని కేవలం వేడుకగా కాకుండా, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించడం అభినందనీయమని వారు తెలిపారు. ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే బాలు నాయక్ గారి ఆశయాలకు అనుగుణంగా యువత సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం సంతోషకరమని అన్నారు.
ఈ రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో యువకులు, విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఎన్ ఎస్ యుఐనాయకులు, వైద్య సిబ్బంది, రక్తదాతలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.