మహబూబాబాద్ రోటరీ క్లబ్‌కు అవార్డుల పంట..
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్తమ సేవారత్నతో పాటు తొమ్మిది అవార్డులు.. మహబూబాబాద్/హైదరాబాద్, జూలై 3(చైతన్యగళం): రోటరీ క్లబ్ ఆఫ్ మహబూబాబాద్ మరోసారి తన సేవా కార్యక్రమాలతో గుర్తింపు పొందింది. హైదరాబాద్‌లోని కొంపెల్లి వేదికగా నిర్వహించిన రోటరీ డిస్ట్రిక్ట్-3150 వార్షిక అవార్డుల ప్రదానోత్సవంలో క్లబ్‌కు ప్రతిష్ఠాత్మక ఉత్తమ సేవారత్న అవార్డు లభించింది. అంతేకాకుండా వివిధ సేవా విభాగాల్లో మరో తొమ్మిది అవార్డులు దక్కించుకుని రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో విశిష్ట స్థానాన్ని సంపాదించింది. డిస్ట్రిక్ట్ గవర్నర్ రాంప్రసాద్ చేతుల మీదుగా క్లబ్ అధ్యక్షుడు వేమిశెట్టి కిషోర్...