నందికొట్కూరులో ఏపీ ఫుడ్ సేఫ్టీ చైర్మన్ ఆకస్మిక తనిఖీ

నందికొట్కూరు, జూలై 3 (చైతన్యగళం): నందికొట్కూరు, పగిడ్యాల మండలాల్లోని లక్ష్మాపురం అంబేద్కర్ గురుకులం, అంగన్‌వాడీ కేంద్రాలు, కోటా హైస్కూల్, గర్ల్స్ స్కూల్, సివిల్ సప్లై గోడౌన్, మిడుతూరు మండలంలోని పలు కేంద్రాలను ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “పేద పిల్లలకు పెట్టే అన్నంలో కక్కుర్తి వద్దు, లంచాలకు ఆశపడొద్దు. వంట నాణ్యతలో లోపాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు. గురుకులాల్లో వంట సిబ్బంది ఎదుర్కొంటున్న జీతాల సమస్యను...