అద్విత ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఘనంగా విద్యార్థి నాయకత్వ ప్రమాణ స్వీకారోత్సవం

కరీంనగర్, జూలై 3(చైతన్యగళం): అద్విత ఇంటర్నేషనల్ స్కూల్‌లో విద్యార్థి నాయకత్వ బృందం (స్టూడెంట్ కౌన్సిల్) ప్రమాణ స్వీకారోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ప్రజాస్వామ్య విలువలను విద్యార్థుల్లో పెంపొందించే లక్ష్యంతో పది రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన నాయకత్వ ఎంపిక ప్రక్రియ అనంతరం ఈ కార్యక్రమం జరిగింది. మొదటగా విద్యార్థి నాయకత్వ పదవులను ప్రకటించి నామినేషన్లు స్వీకరించారు. అనంతరం అభ్యర్థులకు ఇంటర్వ్యూలు రాత పరీక్షలు నిర్వహించి అర్హులను ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులు తమ లక్ష్యాలు నినాదాలతో ప్రచారం నిర్వహించగా ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా...